ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Srinivas Verma: ఆ రైల్వే‌లైన్‌పై కేంద్రమంత్రి కీలక ప్రకటన

ABN, Publish Date - Jan 02 , 2025 | 06:37 PM

Union Minister Bhupatiraju Srinivasa Varma: వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా నోచుకోలేదని కేంద్ర పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరోపించారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు తరలిపోయాయని చెప్పారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రామాయణపట్నం , అనకాపల్లితో పాటు మరికొన్ని పరిశ్రమలును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు.

Minister Bhupatiraju Srinivasa Varma

పశ్చిమగోదావరి: ఏపీలో ఏన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలు పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని కేంద్ర పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు. పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో మంచి పరిస్థితులు వచ్చాయని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇవాళ(గురువారం) మంత్రి శ్రీనివాస వర్మ పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొని మాట్లాడారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా నోచుకోలేదని ఆరోపించారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు తరలిపోయాయని చెప్పారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రామాయణపట్నం , అనకాపల్లితో పాటు మరికొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. నర్సాపురం మచిలీపట్నం కొత్త రైల్వే లైన్‌కు డీపీఆర్ సిద్ధమైందని చెప్పారు. ఈ బడ్జెట్‌లో నిధులు కూడా విడుదల కావచ్చని అన్నారు. నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్ పనులకు కావాల్సిన నిధులు , భూసేకరణ ,కారణంగా పనులు జాప్యం అయ్యాయని తెలిపారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో త్వరలో కిడ్నీ డయాలసిస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటి ఏర్పాటుకు రూ.10కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..

AP Politics: టీడీపీ వర్సెస్ వైసీపీగా మండల సర్వసభ్య సమావేశం.. మాటల యుద్ధానికి దిగిన ఇరువర్గాలు..

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ మీటింగ్... కీలక అంశాలకు ఆమోద ముద్ర

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 02 , 2025 | 06:41 PM