Share News

Heatwave: మండిన ఉత్తర కోస్తా

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:08 AM

సోమవారం ఉదయం నుంచి వేడిగాలులు రావడంతోప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్‌ ప్రకారం.. సోమవారం మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, అనకాపల్లి జిల్లా నాతవరం, రావికమతం, ప్రకాశం జిల్లా పెద్దారవీడు,

Heatwave: మండిన ఉత్తర కోస్తా

వీరఘట్టంలో 42.8 డిగ్రీలు నమోదు

అమరావతి, విశాఖపట్నం, మార్చి 17(ఆంధ్రజ్యోతి): వాయవ్య భారతం నుంచి మధ్య భారతం మీదుగా పొడి గాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో సోమవారం వేడి వాతావరణం కొనసాగింది. ఉత్తరకోస్తాలో ఎండ తీవ్రత పెరిగి వడగాడ్పులు వీస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి వేడిగాలులు రావడంతోప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్‌ ప్రకారం.. సోమవారం మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, అనకాపల్లి జిల్లా నాతవరం, రావికమతం, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1, కర్నూలు జిల్లా నన్నూరులో 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 మండలాల్లో తీవ్రం గా, 78 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలుచోట్ల గాడ్పుల ప్రభావం కొనసాగింది. మంగళవారం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లోని 29 మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు 99 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రెండు రోజుల తర్వాత గాడ్పుల ప్రభావం స్వల్పంగా తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది.


ఇవి కూడా చదవండి...

Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Updated Date - Mar 18 , 2025 | 05:08 AM