Bill Gates Tweet: సహకారం కొనసాగిస్తాం.. ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలపై బిల్ గేట్స్..
ABN , Publish Date - Mar 20 , 2025 | 10:45 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అపర కుబేరుడు బిల్ గేట్స్ స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం, అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని బిల్ గేట్స్ చెప్పారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అపర కుబేరుడు బిల్ గేట్స్ (Bill Gates) స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu)ను కలవడం, అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని బిల్ గేట్స్ చెప్పారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఇండియా (Bill Melinda Gates Foundation India), ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగిందని.. వైద్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో ఎంఓయూ చేసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు తమ సహకారం ఎప్పుడూ కొనసాగిస్తామని గేట్స్ పేర్కొన్నారు. ఈ మేరకు ఒప్పందాల సమయంలో జరిగిన మీటింగ్‌పై చంద్రబాబు చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ బిల్ గేట్స్ రీట్వీట్ చేశారు.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య ఢిల్లీలో బుధవారం కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఆరోగ్య సంరక్షణ, మెడికల్ టెక్నాలజీ, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెంపొందించే విషయంలో సహకరిస్తానని బిల్ గేట్స్ హామీ ఇచ్చారు. అలాగే కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపైనా ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించాలని నిన్న జరిగిన భేటీలో నిర్ణయించారు. దాదాపు గంట సేపు కీలక అంశాలపై చర్చించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఎంఓయూపై సంతకాలు చేశాయి. ఈ భేటీని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేయగా.. తాజాగా బిల్స్ గేట్స్ సైతం రీట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pavel Stepchenko Retirement: 23 ఏళ్లకే రిటైర్మెంట్.. రికార్డులు సృష్టించిన యువకుడు..
Road Accidents in Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఘోర రోడ్డుప్రమాదాలు.. పరిస్థితి ఎలా ఉందంటే..