Minister: ఇక.. ఇంటి వద్దకే రేషన్ సరుకులు..
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:47 PM
ఇక.. ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామన మంత్రి చక్రపాణి తెలిపారు. ఈ విధానాన్ని అతి త్వరలోనే అమల్లోకి వస్తుందరి మంత్రి వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

- మంత్రి చక్రపాణి
చెన్నై: రేషన్ సరకులు ఇళ్లకే వెళ్లి అందించే కార్యక్రమం త్వరలో అమలులోకి రానుందని ఆహార శాఖ మంత్రి చక్రపాణి(Minister Chakrapani) తెలిపారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే సెంగోట్టయ్యన్... కర్ణాటక రాష్ట్రంలో రేషన్ కార్డుదారుల ఇళ్లకే సరుకులు అందించే పథకం అమలులో ఉందని, రాష్ట్రంలో కూడా ఈ పథకం ప్రవేపెట్టే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు. దానికి మంత్రి చక్రపాణి సమాధానిమిస్తూ... కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రాలో కూడా సరుకులు ఇళ్లకే వెళ్లి ఇస్తున్నారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: లవ్ ట్రయాంగిల్.. పాత ప్రియుడ్ని పిలిపించి కొత్త ప్రియుడితో..
ఈ నెల 20వ తేది తమ శాఖ అధికారులు ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక(Andhra, Telangana, Karnataka) తదితర రాష్ట్రాలకు వెళ్లి ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ సరకులు సరఫరా విఽధానాలు పరిశీలించనున్నారని తెలిపారు. అధికారుల నివేదిక ఆధారంగా ఈ పథకంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. కాగా, పుదుచ్చేరిలో రేషన్ కార్డుదారుల ఇళ్లకే వెళ్లి రేషన్ సరుకులు అందజేయనున్నట్లు ఆ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి రంగస్వామి బు ధవారం ప్రకటించ డం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
MLA: మద్యం ప్రియులకు రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వండి
RTC bus: అమ్మో.. పెద్దప్రమాదమే తప్పిందిగా.. ఏం జరిగిందంటే..
GATE 2025: గేట్‌లో కందుకూరు వాసి గ్రేట్