Share News

జేఈఈ-మెయిన్స-2 ప్రవేశ పరీక్ష ప్రారంభం

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:44 PM

దేశంలో ప్రఖ్యాతి గాంచిన ఐఐటీ, ఎనఐటీ విద్యాసంస్థల్లో బీటెక్‌, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స-2 ఆనలైన ప్రవేశ పరీక్ష బుధవారం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది.

జేఈఈ-మెయిన్స-2  ప్రవేశ పరీక్ష ప్రారంభం
పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు

కర్నూలు ఎడ్యుకేషన, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రఖ్యాతి గాంచిన ఐఐటీ, ఎనఐటీ విద్యాసంస్థల్లో బీటెక్‌, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స-2 ఆనలైన ప్రవేశ పరీక్ష బుధవారం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని అయాన డిజిటల్‌ సెంటర్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9వ తేదీ వరకు కొనసాగుతాయి. పేపర్‌-1 ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. రెండు గంటల ముందే పరీక్ష కేంద్రం గేటు వద్ద అభ్యర్థులను పరీక్ష నిర్వహకులు పరిశీలించి లోపలికి అనుమతించారు. అభ్యర్థులు వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లు, సెల్‌ఫోన్లను భద్రపరుచుకోవడానికి డిపాజిట్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు.

Updated Date - Apr 02 , 2025 | 11:44 PM