Firing Viral Video: గన్ వాడాలంటే వీడి తర్వాతే ఎవరైనా.. ఎలా ఫైర్ చేశాడో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:48 PM
జాతర, తిరునాళ్లలో దూరంగా ఉన్న బెలూన్లను గన్‌తో పేల్చడం చూస్తుంటాం. ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు కానీ.. పది బెలూన్లలో ఒకటో రెండో పేల్చడం చూస్తుంటాం. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి టాలెంట్ చూసి అంతా అవాక్కవుతున్నారు.

కొందరి టాలెంట్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరి టాలెంట్ చూస్తే అనితరసాధ్యం.. అని అనిపిస్తుంటుంది. అందరికీ కష్టం అనిపించే పనులను కొందరు తేలిగా చేసేయడం చూస్తుంటాం. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గన్ ఫైరింగ్ చేయడం చూసి అంతా అవాక్కవుతన్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘గన్ వాడాలంటే వీడి తర్వాతే ఎవరైనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జాతర, తిరునాళ్లలో దూరంగా ఉన్న బెలూన్లను గన్‌తో పేల్చడం చూస్తుంటాం. ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు కానీ.. పది బెలూన్లలో ఒకటో రెండో పేల్చడం చూస్తుంటాం. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి టాలెంట్ చూసి అంతా అవాక్కవుతున్నారు.
Eagle Viral Video: డేగ వేటంటే ఇలాగే ఉంటుంది.. నీటిలోని చేపను ఎలా తినేసిందో చూస్తే..
బోర్డుపై ఉన్న బెలూన్లు అన్నింటినీ రెప్పపాటు (man shot balloons with gun) కాలంలో కాల్చిపడేశాడు. తర్వాత ఓ వ్యక్తి అక్కడికి వెళ్లి బెలూన్లను బోర్డుకు తగిలించగా.. ఆ వ్యక్తి టపాటపా కాల్చేశాడు. ఒక్క బుల్లెట్ కూడా వృథా కాకుండా ఒక్కో బెలూన్‌కు ఒక్కోటి చొప్పున కాల్చుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. చివరకు బోర్డుకు అవతల ఉన్న వారు, బెలూన్లను గాల్లోకి విసిరినా కూడా అతను వాటిని కూడా వదల్లేదు. ఇలా ఎక్కడా గురి తప్పకుండా ఎదురుగా ఉన్న బెలూన్లను అన్నింటినీ కాల్చేసి, అందరికీ షాక్ ఇచ్చాడన్నమాట.
Lovers Funny Video: మేడపై ప్రియుడిని కలుసుకున్న యువతి.. కంటపడగానే ఏం చేసిందో చూస్తే.. ఖంగుతింటారు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫర్‌ఫెక్ట్ ఫైరింగ్ అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘గన్ వాడాలంటే వీడి తర్వాతే ఎవరైనా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4200కు పైగా లైక్‌లు, 1.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Toilet Funny Video: వార్నీ.. టెక్నాలజీని ఇక్కడ కూడా వాడాలా.. ఈ బాత్రూంలో షవర్ చూస్తే..
ఇవి కూడా చదవండి..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..