YS Jagan: పులివెందులలో జగన్‌కు చెక్ పెట్టేలా టీడీపీ మాస్టర్ ప్లాన్

ABN, Publish Date - Feb 12 , 2025 | 08:41 AM

YS Jagan:పులివెందులలో వైఎస్ జగన్‌కు చెక్ పెట్టేలా తెలుగుదేశం పార్టీ మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రజల్లో బలం ఉన్న వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీని ఢీకొట్టేలా పావులు కదుపుతోంది.

YS Jagan: పులివెందులలో జగన్‌కు చెక్ పెట్టేలా టీడీపీ మాస్టర్ ప్లాన్

కడప: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయకోట పులివెందుల మున్సిపాలిటీపై తెలుగుదేశం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జగన్‌కు చెక్ పెట్టేలా టీడీపీ పావులు కదుపుతోంది. ఏపీలో ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో పసుపు జెండా రెపరెపలాడింది. పులివెందులలో కూడా జగన్‌ను ఢీకొట్టేలా టీడీపీ మాస్టర్ ప్లాన్ వేసింది. అనుకున్నదే తడవుగా ప్రజల్లో బలం ఉన్న నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి స్థానిక కేడర్ సిద్ధమవుతున్నారు. పులివెందుల టీడీపీ నేతలు కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులను హై కమాండ్‌కు వివరిస్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీలోని 30 వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదాతో పాటు 20 కుటుంబాలు ఇవాళ(బుధవారం) టీడీపీలో చేరాయి. వీరితో పాటు పులివెందుల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు.


జగన్‌పై ప్రజల్లో వ్యతిరేకత..

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలో ఎన్టీఏ ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అదీకాక.. గత జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించిన తీరుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వైసీపీకి చెందిన పార్టీ శ్రేణులు టీడీపీలో చేరుతున్నాయి.


ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో..

అలాగే వై నాట్175 ? అంటూ అధికారంలో ఉండగా జగన్.. వైసీపీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ప్రతిపక్ష హోదా కేటాయించాలని జగన్.. అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడుకు కూడా లేఖ రాశారు. కానీ సంఖ్య బలం లేదంటూ స్పీకర్ స్పష్టం చేయడంతో.. జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటు అసెంబ్లీకి వెళ్లలేక ఇంట్లో ఉంటే తమకు స్థానికంగా గుర్తింపు ఉండదంటూ పలువురు నేతలు వాపోతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేయాలని దిగువ స్థాయి నేతలు సిద్ధమవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌ లిక్కర్‌ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి

మళ్లీ రాజకీయాల్లోకి రాను

ఏడాదైనా ఫైళ్లు క్లియర్‌ చేయరా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 12 , 2025 | 09:38 AM