CM Chandrababu On Tirumala: తిరుమలలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:48 PM
CM Chandrababu On Tirumala: తిరుమలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్త్‌లో చేపట్టే చర్యలు చర్చించారు సీఎం.

అమరావతి, ఏప్రిల్ 2: తిరుమల తిరుపతి దేవస్ధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (బుధవారం) సచివాయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ (TTD) ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్‌లో చేపట్టే చర్యలపై టీటీడీ పెద్దలతో సీఎం సమీక్ష జరిపారు. టీటీడీ దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమాయాలతో పాటు... సాధారణ రోజుల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారి అభిప్రాయాలపైనా చర్చకు వచ్చింది.
Vijay Kumar ACB Investigation: హైకోర్టు మొట్టికాయలతో ఏసీబీ ముందుకు విజయ్
శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై నివేదికను సీఎం చంద్రబాబుకు టీటీడీ ఇచ్చింది. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాఢవీధులలో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతీ అమ్మవారి దేవాలయం అభివృద్ది ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ది పనులు వంటి అంశాలపై సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి వివరాలను టీటీడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రం వెలుపల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిపై సీఎంకు నివేదిక సమర్పించింది టీటీడీ.
ఇవి కూడా చదవండి
Ameenpur Case Twist: అమీన్‌పూర్ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం
Vijay Kumar ACB Investigation: హైకోర్టు మొట్టికాయలతో ఏసీబీ ముందుకు విజయ్
Read Latest AP News And Telugu News