Share News

Amaravti: రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ఆఖరి గడువు ఇదే

ABN , Publish Date - Jan 10 , 2025 | 03:40 PM

Amaravati: టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించి.. వైసీపీ నిర్లక్ష్యంతో నిలిచిన పనులను పూర్తి చేసేందుకు బిడ్లు ఆహ్వానించింది. రూ.2,816 కోట్ల విలువైన పనులకు టెండర్‌లను పిలిచింది సీఆర్డీఏ. బిడ్లను దాఖలు చేసేందుకు ఈ నెల 31న సాయంత్రం 4 గంటల వరకు గడువు విధించింది.

Amaravti: రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ఆఖరి గడువు ఇదే
AP Capital Amaravati

అమరావతి, జనవరి 10: రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు సీఆర్‌డీఏ టెండర్లను పిలిచింది. రాజధానిలో రూ.2816 కోట్లతో అభివృద్ధి పనులకు ఏపీ సీఆర్డీఏ టెండర్లను పిలిచింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించి.. వైసీపీ నిర్లక్ష్యంతో నిలిచిన పనులను పూర్తి చేసేందుకు బిడ్లు ఆహ్వానించింది. రూ.2,816 కోట్ల విలువైన పనులకు టెండర్‌లను పిలిచింది సీఆర్డీఏ. బిడ్లను దాఖలు చేసేందుకు ఈ నెల 31న సాయంత్రం 4 గంటల వరకు గడువు విధించింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సాంకేతిక బిడ్లను సీఆర్డీఏ తెరవనుంది. పాలవాగు, గ్రావిటీ కాలువల పనులతో పాటు రాజధాని నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్లకు సంబంధించిన పనులకు టెండర్లను ఆహ్వానించారు. అనంతవరం నుంచి ఉండవల్లి వరకు కొండ వీటి వాగును, దొండపాడు నుంచి కృష్ణాయ పాలెం వరకు పాలవాగును వెడల్పు, లోతు చేసే పని కోసం శాఖమూరులో రూ. 462.26 కోట్లతో 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నారు.


రూ.303.73 కోట్లతో 7.83 కి.మీ. పొడవు కాలువ నిర్మాణం, 0.1 టీఎంసీ సామర్థ్యంతో కృష్ణాయపాలెం రిజర్వా‌యర్ పనులను చేయనున్నారు. వీటితోపాటు రూ.372.23 కోట్లతో ఈ8 రోడ్డు, రూ.419.96 కోట్లతో ఈ9, రూ.241.67 కోట్లతో ఈ14, రూ.443.84 కోట్లతో ఎన్‌12, రూ.183.21 కోట్లతో ఎన్‌6, రూ.364.41 కోట్లతో ఈ3 ఇలా వివిధ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేయనున్నారు. వాననీటి మళ్లింపు కాలువలు, తాగునీటి సరఫరా పైపులైన్లు, డ్రెయినేజీలు, పచ్చదనం అభివృద్ధి, పాదచారులు- సైకిల్ ట్రాక్లు, విద్యుత్, కమ్యూనికేషన్ తీగలను అమర్చేందుకు డక్ట్ నిర్మాణం కోసం సీఆర్డీఏ టెండర్లను పలిచింది.


ఇవి కూడా చదవండి...

AP Police: పిఠాపురం జనసేన సభలో పోలీసుల ఓవరాక్షన్

Tirupati Stampede: తిరుపతి ఘటన.. ఏం జరిగిందో చెప్పిన ఏపీ మంత్రి

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 10 , 2025 | 03:40 PM