Share News

Srikakulam: అక్కడ పది పరీక్ష.. నల్లేరుపై నడక!

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:26 AM

ఈ కేంద్రంపై అందిన ఫిర్యాదుల మేరకు నాలుగు బృందాలు శుక్రవారం క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా ఏకంగా ఇన్విజిలేటర్లే మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇచ్చినట్టు తేలింది. అక్కడే ప్రశ్నలకు జవాబులు రాస్తున్న ఒక ఇంగ్లిష్‌ టీచర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Srikakulam: అక్కడ పది పరీక్ష.. నల్లేరుపై నడక!

మాస్‌ కాపీయింగ్‌కు ఇన్విజిలేటర్ల సహకారం

విద్యార్థుల నుంచి రూ.30 వేల చొప్పున వసూలు

15 మంది టీచర్ల సస్పెన్షన్‌.. ఐదుగురు విద్యార్థులు డిబార్‌

శ్రీకాకుళం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్‌ స్కూలు పరీక్ష కేంద్రంలో శుక్రవారం జరిగిన పరీక్షలో ఏకంగా ఇన్విజిలేటర్లే మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ కేంద్రంపై అందిన ఫిర్యాదుల మేరకు నాలుగు బృందాలు శుక్రవారం క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా ఏకంగా ఇన్విజిలేటర్లే మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇచ్చినట్టు తేలింది. అక్కడే ప్రశ్నలకు జవాబులు రాస్తున్న ఒక ఇంగ్లిష్‌ టీచర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్‌ క్లర్కు ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 వేలు వసూలు చేసినట్లు తేలింది. ట్రిపుల్‌ ఐటీలో సీట్ల కోసమే మాస్‌ కాపీయింగ్‌కు తెరలేపినట్లు తెలిసింది. మాస్‌ కాపీయింగ్‌కు బాధ్యులైన 15 మంది ఉపాధ్యాయులను డీఈవో సస్పెండ్‌ చేశారు. ఐదుగురు విద్యార్థులను డిబార్‌ చేశారు. ఈ వ్యవహారం గత కొన్నేళ్లగా జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏటా ఇదే కేంద్రం నుంచి పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో ఎక్కువ మందికి ట్రిపుల్‌ ఐటీ సీట్లు రావడానికి ఇదే కారణమని చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని ఎచ్చెర్ల పోలీసులకు విద్యాశాఖాధికారులు ఫిర్యాదు చేశారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 05:26 AM