Share News

Rajamahavendravaram : ‘కొవ్వూరు కంఠకుల’పై విచారణ

ABN , Publish Date - Mar 24 , 2025 | 05:42 AM

‘‘కొవ్వూరులో కంఠకులు’’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై తూర్పుగోదావరి జిల్లా యంత్రాం గం స్పందించింది.

Rajamahavendravaram : ‘కొవ్వూరు కంఠకుల’పై విచారణ

  • మట్టి, ఇసుక తవ్వకాలపై నిఘా.. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై అధికారుల వివరణ

రాజమహేంద్రవరం మార్చి 23(ఆంధ్రజ్యోతి): ‘‘కొవ్వూరులో కంఠకులు’’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై తూర్పుగోదావరి జిల్లా యంత్రాం గం స్పందించింది. గతంలో వాడపల్లి వన్‌ ర్యాంప్‌ నుంచి రోజుకు 250 లారీలు వెళ్లిన మాట వాస్తవమేనని, ప్రస్తుతం కొవ్వూరు మండలం పరిధిలోని అన్ని ర్యాంప్‌ల నుంచి 190 లారీలే వెళ్తున్నాయని కొవ్వూరు తహసీల్దార్‌ ఎం.దుర్గాప్రసాద్‌ వివరించారు. దేచర్లలో మట్టి తవ్వకాలపై మైన్స్‌ అధికారులు పనులను ఆపినట్టు చెప్పారు. చిడిపి వద్ద మట్టి తవ్వకాల కోసం గోదావరికి అడ్డంగా వేసినట్టు పేర్కొన్న రహదారిని ఇసుక రవాణాకు గతంలో నిర్మించారన్నారు. ఇక్కడ నిఘాపెట్టి మట్టి తవ్వకాలను నిలిపివేసినట్టు తెలిపారు. కుమాదేవంలో ఎస్సీలకు ఇచ్చిన వ్యవసాయ భూమిలో మట్టి తవ్వకాలు ఆపివేశామని వివరించారు.

Updated Date - Mar 24 , 2025 | 05:42 AM