Share News

AP JAC : ఆ తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయదు

ABN , Publish Date - Mar 24 , 2025 | 05:37 AM

ప్రస్తుత ప్రభుత్వం అనుభవంతో కూడినదని ఏపీ జేఏసీ చైర్మన్‌ కేవీ శివారెడ్డి అన్నారు. ఆదివారం విజయవాడ ఎన్జీవో భవన్‌లో రాష్ట్ర వ్యవసాయ...

AP JAC : ఆ తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయదు

ఉద్యోగులకు రూ.7,500 కోట్లు విడుదల: ఏపీ జేఏసీ చైర్మన్‌ శివారెడ్డి

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ప్రభుత్వం అనుభవంతో కూడినదని ఏపీ జేఏసీ చైర్మన్‌ కేవీ శివారెడ్డి అన్నారు. ఆదివారం విజయవాడ ఎన్జీవో భవన్‌లో రాష్ట్ర వ్యవసాయ విస్తరణాధికారుల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల అవలంబించిన వైఖరి వల్ల గత ప్రభుత్వాన్ని సాగనంపారని.. ఆ తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వం చేయదన్నారు. కూటమి ప్రభుత్వం జనవరిలో రూ.1,300 కోట్లు, ప్రస్తుతం రూ.6,200 కోట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మంజూరు చేసిందని తెలిపారు. రైతు సేవా కేంద్రాల నుంచి ఏఈవోలను తొలగించొద్దని, జాబ్‌చార్ట్‌, పదోన్నతి స్కేళ్లు, ఏజీబీఎస్సీ సీట్లను కొనసాగించాలని వ్యవసాయ విస్తరణాధికారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డీవీ వేణుమాధవరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సంఘం 2025 డైరీని శివారెడ్డి, ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌ ఆవిష్కరించారు.

Updated Date - Mar 24 , 2025 | 05:43 AM