Share News

YS Jagan Tour: బెంగళూరు నుంచి పులివెందులకు జగన్‌

ABN , Publish Date - Mar 24 , 2025 | 05:32 AM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీప బంధువు విజయశేఖర్‌రెడ్డి(69) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.

YS Jagan Tour: బెంగళూరు నుంచి పులివెందులకు జగన్‌

పులివెందుల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీప బంధువు విజయశేఖర్‌రెడ్డి(69) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. దీంతో జగన్‌ సతీసమేతంగా బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల చేరుకున్నారు. విజయశేఖర్‌రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, కడప మేయర్‌ సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత జగన్‌ భాకరాపురంలోని తన ఇంటికి వచ్చారు. సోమవారం లింగాల మండలంలో పర్యటిస్తారు. శనివారం రాత్రి పెనుగాలులకు పెద్దఎత్తున ధ్వంసమైన అరటితోటలను పరిశీలిస్తారు. తర్వాత పులివెందులకు తిరిగొచ్చి తాడేపల్లికి బయల్దేరతారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Mar 24 , 2025 | 05:32 AM