కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం: పయ్యావుల
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:51 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 3,324 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 3,324 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శాసన మండలిలో సభ్యుల ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం 4,333 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటి క్రమబద్ధీకరణపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరామని, మిగిలిన ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.