Mandapeta: వివాహేతర సంబంధం.. తండ్రిని కడ తేర్చిన కుమార్తె
ABN , Publish Date - Mar 21 , 2025 | 09:47 PM
Mandapeta: వివాహేతర సంబంధం వద్దని వారించినందుకు కన్న తండ్రిని ప్రియుడితో కలిపి ఓ కుతూరు హత్య చేసింది. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గ పరిథిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో తీగ లాగితే కొండ కదిలినట్లు.. తన తండ్రిని తామే హత్య చేసినట్లు హతుడి కుమార్తె వెల్లడించింది.

రాజమండ్రి, మార్చి 21: వివాహేతర సంబంధానికి అడ్డు చెప్పాడని కన్న తండ్రిని ఓ కుమార్తె కడతేర్చింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా మండపేటలో చోటు చేసుకుంది. రామచంద్రాపురం నియోజకవర్గం కొత్తూరు గ్రామానికి చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో వస్త్రాల వెంకట దుర్గ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఆమె తండ్రికి తెలిసింది. దీంతో ఇది తప్పంటూ కుమార్తె వెంకట దుర్గను కన్నతండ్రి మందలించాడు.
ఈ వ్యవహారం ఇకపై కొనసాగనివ్వదంటూ కుమార్తెను హెచ్చరించాడు. జరిగిన విషయాన్ని ప్రియుడు సురేష్‌కు ఆమె వివరించింది. ఈ నేపథ్యంలో ఆమె కన్నతండ్రి సూరా రాంబాబను అంతమొందించాలని వారిద్దరు నిర్ణయించారు. అందుకు పథకాన్ని సిద్దం చేశారు. ఆ క్రమంలో సూరా రాంబాబును దారుణంగా హత్య చేశారు.
అయితే సూరా రాంబాబు దారుణంగా హత్య కావించబడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఆమె కుమార్తె వెంకట దుర్గను పోలీసులు విచారించారు. దాంతో తన కన్నతండ్రి సూరా రాంబాబును తామే హత్య చేశామంటూ ఆమె పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. దీంతో ఆమెతోపాటు ఆమె ప్రియుడు ముమ్మిడివరపు సురేష్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం మండపేట ఎస్ఐ ఈ హత్య కేసు వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Psycho: సైకో హల్‌చల్.. రంగంలోకి పోలీసులు
Anchor Shyamala: శ్యామలకు షాక్.. కోర్టు కీలక ఆదేశాలు..
కొత్తిమీర రసం తాగితే ఇన్ని లాభాలా..?
Rains in AP: ప్రజలకు కూల్ న్యూస్
Viral News: య్యూటూబ్‌లో చూసి ఆపరేషన్ చేసుకున్నాడు.. ఆ తర్వాత..
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
Chiranjeevi: లండన్ పర్యటనలో చిరు.. వారిపై ఫైర్
For AndhraPradesh News And Telugu News