Namrata: బిడ్డలకు తల్లిపాలే శ్రేయస్కరం
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:52 AM
తల్లి పాలు తక్కువ ఉన్న వారికి, నెలలు నిండకుండా, బరువు తక్కువగా పుట్టిన వారికి ఈ మిల్క్‌బ్యాంకు ద్వారా పాలు అందిస్తారని తెలిపారు. పాలు ఎక్కువగా ఉన్న దాతల నుంచి సేకరించి అనేక కారణాల వల్ల తల్లిపాలు అందని నవజాత శిశువులకు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఏటా 7,200 మంది నవజాత శిశువులకు ఈ బ్యాంకు ద్వారా పాలు అందిస్తారన్నారు.

మహేశ్‌బాబు సతీమణి నమ్రత
ఆంధ్రా ఆస్పత్రిలో మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం
విజయవాడ, మార్చి 16(ఆంధ్రజ్యోతి): నవజాత శిశువులకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని సినీనటుడు మహేశ్‌బాబు సతీమణి నమ్రత అన్నారు. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో ఆంధ్రా ఆస్పత్రి, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సంయుక్తంగా రూ.37.24 కోట్లతో ఏర్పాటు చేసిన మదర్స్ మిల్క్ బ్యాంకును ఆమె ఆదివారం ప్రారంభించారు. అనంతరం నమ్రత మాట్లాడుతూ.. తల్లి పాలు తక్కువ ఉన్న వారికి, నెలలు నిండకుండా, బరువు తక్కువగా పుట్టిన వారికి ఈ మిల్క్‌బ్యాంకు ద్వారా పాలు అందిస్తారని తెలిపారు. పాలు ఎక్కువగా ఉన్న దాతల నుంచి సేకరించి అనేక కారణాల వల్ల తల్లిపాలు అందని నవజాత శిశువులకు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఏటా 7,200 మంది నవజాత శిశువులకు ఈ బ్యాంకు ద్వారా పాలు అందిస్తారన్నారు. మదర్స్ మిల్క్‌బ్యాంకును ఏర్పాటు చేసిన రోటరీ, ఆంధ్ర హాస్పిటల్స్‌కు అభినందనలు తెలిపారు. ఎంతోమంది నవజాత శిశువులకు తల్లిపాలు అందించడం ద్వారా రాబోయే రోజుల్లో శిశువులకు అనారోగ్య సమస్యలు దూరంచేసే ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని చెప్పారు. మహేశ్‌బాబు ఫౌండేషన్ ద్వారా గర్భాశయ కేన్సర్ నివారణకు వ్యాక్సిన్ వేయిస్తున్నామని ఆమె తెలిపారు. ఏటా 1,500 మందికి ఈ వ్యాక్సిన్ వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అనంతరం మహేశ్‌బాబు ఫౌండేషన్ సహకారంతో గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్న పిల్లలతో ఆమె మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆంధ్ర హాస్పిటల్స్ అధినేత పీవీ రమణమూర్తి, మేనేజింగ్ డైరెక్టర్ పీవీ రామారావు, డాక్టర్ కె.విక్రమ్, కార్డియాక్ట్ టీమ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..