Chief Secretary: కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు!
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:16 AM
రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.

ఏప్రిల్‌లో బాధ్యతల స్వీకారం
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 1989 బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి 2021 జనవరి నుంచి సీఎ్‌సగా వ్యవహరిస్తున్నారు. ఆమె పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎ్‌సగా రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం.
1991 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది