Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:13 PM
Kakani Investigation News: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణకు డుమ్మా కొట్టారు. గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు మాజీ మంత్రి.

నెల్లూరు, ఏప్రిల్ 1: అక్రమమైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Former Minister Kakani Govardhan Reddy) రెండో రోజు కూడా విచారణకు గైర్హాజరయ్యారు. అయితే ఉదయం నుంచి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద... కాకాణి విచారణకు వస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. చివరకు రెండో రోజు విచారణకు కూడా మాజీ మంత్రి డుమ్మా కొట్టారు. ఇప్పటికే కాకాణికి పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. రేపు (బుధవారం) రాత్రి కాకాణి నెల్లూరు చేసుకోనున్నారు. గురువారం నుంచి అందుబాటులో ఉంటానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేపు కుటుంబ శుభకార్యంలో పాల్గొని నెల్లూరుకు వస్తానని ఆయన చెప్పారు.
దీంతో మరోసారి కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. కాకాణి విచారణకు హాజరు కాకపోవడంతో డీఎస్పీ శ్రీనివాసరావు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మరోవైపు కాకాణి బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో (AP High Court) విచారణకు రానుంది. ఈ క్రమంలో మాజీ మంత్రికి బెయిల్ మంజూరు అవుతుందా? లేదా? అనే అంశంపైనా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కాకాణితో సహా ఐదుగురు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. క్వార్ట్జ్ కేసులో అట్రాసిటీ యాక్ట్‌ను పోలీసులు యాడ్ చేశారు.
ఇవి కూడా చదవండి
Ponnam Prabhakar Farmers: వాటిని కొనేందుకు ప్రభుత్వం సిద్ధం
HCU Land Politics:హెచ్‌సీయూ భూముల వివాదంపై రాజకీయ రగడ
Read Latest AP News And Telugu News