Share News

Andhra Pradesh Ramagiri clashes: రామగిరిలో వైసీపీ,టీడీపీ వర్గీయుల ఘర్షణ

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:15 AM

శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడుల కారణంగా వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు 144 సెక్షన్ విధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు.

Andhra Pradesh Ramagiri clashes: రామగిరిలో  వైసీపీ,టీడీపీ వర్గీయుల ఘర్షణ

వాహనాలు ధ్వంసం.. చెదరగొట్టిన పోలీసులు

ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత

తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి అరెస్టు.. విడుదల

ధర్మవరం/రామగిరి/సోమందేపల్లి, మార్చి 26(ఆంరధజ్యోతి): శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో వైసీపీ, టీడీపీ వర్గీయులు బుధవారం ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఏడాది క్రితం రామగిరి ఎంపీపీ మీనిగ నాగమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో గురువారం ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఎంపీపీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ, టీడీపీ ప్రయత్నిస్తున్నాయి. వైసీపీ నాయకులు హరినాథరెడ్డి, రాప్తాడు జడ్పీటీసీ రామాంజినేయులు, లీగల్‌ సెల్‌ నాయకులు నాగిరెడ్డి విప్‌ జారీ కోసం రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి బుధవారం చేరుకున్నారు. వారికి టీడీపీ నాయకులు ఎదురుపడటంతో మాటామాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఎస్పీ రత్న, ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్‌ అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైసీపీ నాయకుల వాహనాలను పోలీసులు తనిఖీ చేసి, కొడవలి, కరపత్రాల బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో 144 సెక్షన్‌ విధించి, భారీ ఎత్తున బలగాలను మోహరించారు. కాగా.. ఘర్షణ సమాచారంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి అనుచరులతో బెంగళూరు నుంచి రామగిరికి బయలుదేరారు. ఆయనను పోలీసులు సోమందేపల్లి వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. వాహనాలను తనిఖీలు చేసి ఆయన్ను, అనుచరులను సోమందేపల్లి స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని డీఎస్పీ వివరించారు. రెండు గంటల విచారణ అనంతరం సొంత పూచీకత్తుపై ప్రకాశ్‌ రెడ్డిని విడుదల చేశారు. రామగిరిలో టీడీపీకి బలం లేకపోయినా ఎంపీపీ ఎన్నికల్లో వివాదం సృష్టిస్తోందని, ఎన్నికను ఆపాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. పోలీసులు చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల సూచన మేరకు ప్రకాశ్‌ రెడ్డి బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 04:15 AM