AP News: జూమ్ మీటింగ్‌లో షాకింగ్ సీన్.. శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఏం చేశాడంటే...
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:42 PM
Sanitary Inspector Controversy: కొంతమంది అధికారులు చేస్తున్న పనులతో ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ప్రజలకు సలహాలు, సూచనలు చేసే అధికారులు చాలా అప్రమత్తతో ఉండాలి. కానీ ఓ అధికారి వ్యవహార శైలితో ప్రభుత్వం అప్రదిష్ట పాలు కావాల్సి వచ్చింది. సదరు అధికారి తీరుపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లాలో ప్రజా సమస్యలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే అధికారులతో ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోంది. ఇవాళ(ఆదివారం) ఏలూరు నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ జి.చంద్రయ్య జూమ్ ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అడిషనల్ కమిషనర్ దృష్టికి ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తీసుకువచ్చారు.
ఈ సమయంలో ఓ అధికారి చేసిన పనితో మిగతా అధికారులు విస్తుపోయారు. జూమ్ మీటింగ్‌లో 16వ సర్కిల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సోమేశ్వరరావు పాల్గొన్నారు. జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న సమయంలో సోమేశ్వరరావు స్మోకింగ్ చేస్తూ కనిపించాడు. కుర్చీలో సోమేశ్వరరావు దర్జాగా కూర్చొని ధూమపానం చేయడం చూసిన మిగతా అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆ దృశ్యాలను తిలకించి మున్సిపల్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర కమిషనర్ భానుప్రతాప్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ సోమేశ్వరరావుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News