Special weekly train: అనంతపురం మీదుగా ప్రత్యేక రైలు..
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:47 PM
అనంతపురం మీదుగా ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ నియంత్రణకు నరసాపూర్-అరిసికెర-నరసాపూర్ (వయా అనంతపురం) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

గుంతకల్లు(అనంతపురం): ప్రయాణికుల రద్దీ నియంత్రణకు నరసాపూర్-అరిసికెర-నరసాపూర్ (వయా అనంతపురం) ప్రత్యేక వీక్లీ రైలు (నం. 07201/02)ను నడపనున్నట్టు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నరసాపూర్-అరిసికెరె(Narasapur-Arisikere) ప్రత్యేక రైలును ఈ ఏప్రిల్ 6, 13, 20, 27, మే 04, 11, 18 25 తేదీల్లో నడపనున్నట్టు తెలియజేశారు. ఈ రైలు పేర్కొన్న తేదీలలో (ఆదివారాలలో) నరసాపూర్‌లో మధ్యాహ్నం 2-20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12-45 గంటలకు అరిసికెరెకు చేరుకుంటుందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Tirupati: తిరుపతి కిడ్నాప్ కేసు.. వెలుగు చూసిన సంచలన విషయాలు..
దీని తిరుగు ప్రయాణపు రైలు ఏప్రిల్ 7, 14, 21, 28, మే 5, 12, 19, 26 తేదీల్లో (సోమవారాలలో) మధ్యాహ్నం 2 గంటలకు అరిసికెరెలో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1 గంటకు నరసాపూర్(Narasapur)కు చేరుకుంటుందన్నారు. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గోవిందవాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్డు(Vijayawada, Guntur, Narasaraopet, Markapur Road), కంబం, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుత్తి, అనంతపూర్, ధర్మవరం, హిందూపురం(Anantapur, Dharmavaram, Hindupur), యల్హంక స్టేషన్ల మీదుగా వెళ్తుందని వివరించారు.
రైలు స్థానాల మార్పు
ధర్మవరం రైల్వే స్టేషన్‌లో నిర్వహణ సమస్యల కారణంగా మచిలీపట్నం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు గమ్యస్థానాన్ని మార్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. మచిలీపట్నం-ధర్మవరం (నం. 17215) ఎక్స్‌ప్రె్‌సను ఈ నెల 31 నుంచి అనంతపురం వరకే గమ్యస్థానాన్ని కుదించినట్టు తెలియజేశారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 17216)ను ఏప్రిల్ 1 నుంచి మే 1 వరకూ ధర్మవరం నుంచి కాకుండా అనంతపురం నుంచి బయల్దేరుతుందని తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టెన్త్ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం
జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు
కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..
Read Latest Telangana News and National News