Prakash Karat: హిందూత్వ-కార్పొరేట్ బంధంపైనే పోరాటం
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:40 AM
బీజేపీ-ఆర్‌ఎ్‌సఎస్ హిందూత్వ-కార్పొరేట్ సంబంధాన్ని ఓడించాలని సీపీఎం నేత ప్రకాశ్ కరట్ పిలుపునిచ్చారు. హిందూత్వ నయా ఫాసిజంపై పోరాడేందుకు వామపక్షాలకే శక్తి ఉందని పేర్కొన్నారు.

హిందూత్వ నయా ఫాసిజంపై పోరాడే ధైర్యం వామపక్షాలదే
సీపీఎం 24వ అఖిల భారత మహాసభలో ప్రకాశ్ కరట్
చెన్నై, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం.. అమెరికా సామ్రాజ్యవాదానికి దగ్గరగా ఉన్న హిందూత్వ-కార్పొరేట్ సంబంధాన్ని సూచిస్తాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్ కరట్ వ్యాఖ్యానించారు. బీజేపీ-ఆర్‌ఎ్‌సఎస్, దానికి ఆధారమైన హిందూత్వ-కార్పొరేట్ సంబంధాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా హిందూత్వ నయా ఫాసిజంపై పోరాడే శక్తి, ధైర్యం వామపక్షాలకే ఉన్నాయని ఉద్ఘాటించారు. హిందూత్వ శక్తులు నిర్వహిస్తున్న రాజకీయ ఆదిపత్యం కేవలం ఎన్నికల మార్గాల ద్వారా మాత్రమే కాదన్నారు. అది సైద్ధాంతిక, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో హిందూత్వ శక్తులు ప్రదర్శించే ప్రభావం ద్వారా సంపాదించిన ఆధిపత్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మనం అవలంభించే రాజకీయ -వ్యూహాత్మక పంథాలో.. బీజేపీ-ఆర్‌ఎ్‌సఎస్, హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా బహుముఖ పోరాటం చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తమిళనాడులోని మదురైలో సీపీఎం 24వ అఖిల భారత మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రకాశ్ కరట్ మాట్లాడుతూ.. ‘‘వామపక్షాలు.. ఐక్య పోరాటాలు, ఓటములు, ఇతర పార్టీలతో ఇమడలేకపోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
హిందూత్వ నయా ఫాసిజంపై పోరాడేందుకు వామపక్షాలకు మాత్రమే ద్రుఢ నిశ్చయం, ధైర్యం, శక్తి ఉన్నాయి.’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సలకు వ్యతిరేకంగా వామపక్షాల ఐక్యతను బలోపేతం చేయడానికి, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడానికి సీపీఎం కృషి చేస్తుందని తెలిపారు. ‘‘డొనాల్డ్ ట్రంప్ తన సన్నిహితుడుగా ఎవరిని చెప్పుకొంటున్నారు? గౌతం అదానీ, ముఖేశ్ అంబానీలకు మిత్రుడు ఎవరు? ఆర్‌ఎ్‌సఎస్ పట్ల విధేయత చూపిస్తోందెవరు?.. ఈ మూడు ప్రశ్నలకు ఒక్కటే సమాధానం.. నరేంద్రమోదీ, బీజేపీ’’ అని కరట్ వ్యాఖ్యానించారు. ‘‘మోదీ ప్రభుత్వం.. అమెరికా సామ్రాజ్యవాదానికి అత్యంత సన్నిహితంగా ఉండే హిందూత్వ కార్పొరేట్ బంధాన్ని ప్రతిబింబిస్తోంది’’ అని కరట్ ఆరోపించారు. బూర్జువా రాజకీయాలు తప్ప బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ పాలనలో మరొకటి కనిపించడం లేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా దుయ్యబట్టారు. ‘‘కార్పొరేట్, మత దాడులను బలంగా ఎదుర్కొనేందుకు అన్ని వామపక్ష శక్తులు ఐక్యం అయ్యేందుకు ఈ సభల ద్వారానే సంకల్పం చెప్పుకోవాలి’’ అని రాజా పిలుపునిచ్చారు. సభా ప్రాంగణానికి ‘కామ్రెడ్ సీతారాం ఏచూరి నగర్’ అని పేరు పెట్టారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..