Bullet Bike Theft Video: బుల్లెట్ బైకును రోడ్డు పక్కన పార్క్ చేస్తున్నారా.. ఎలా ఎత్తుకెళ్లారో చూస్తే..
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:22 PM
రోడ్డు పక్కన వరుసగా బైకులను పార్క్ చేసి ఉంటారు. అటుగా వచ్చిన ఓ దొంగ.. వాటి మధ్యలో ఉన్న బుల్లెట్ బైకుపై కన్నేస్తాడు. చివరకు అతను బైకు చోరీ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

వాహనాల చోరీకి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు దొంగలు చాలా తెలివిగా చోరీలు చేయడం చూస్తుంటాం. మరికొందరు దొంగలు పెద్ద పెద్ద వాహనాలను సైతం ఎంతో చాకచక్యంగా ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కొన్నిసార్లు దొంగలు చేసే చోరీలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి చోరీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ రోడ్డు పక్కన పార్క్ చేసిన బుల్లెట్ బైకును చోరీ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన వరుసగా బైకులను పార్క్ చేసి ఉంటారు. అటుగా వచ్చిన ఓ దొంగ.. వాటి మధ్యలో ఉన్న బుల్లెట్ బైకుపై (Bullet bike) కన్నేస్తాడు. బైకు దగ్గరికి వెళ్లిన అతను.. తన చేతిలోని కీతో తెరిచేందుకు ప్రయత్నిస్తాడు.
Monkey Helping Video: గోతిలో పడిపోయిన పిల్లి.. లోపలికి దూకిన కోతి.. చివరకు చూస్తే..
అయితే మొదట సాధ్యం కాకపోయినా.. తర్వాత మరింత గట్టిగా కీని లోపలికి ప్రెస్ చేస్తాడు. దీంతో చివరకు బైకు హ్యాండిల్ అన్‌లాక్ అయిపోయి, ముందున్న లైట్లు కూడా వెలుగుతాయి. తర్వాత ఆ వ్యక్తి బండిని తీసుకుని వెళ్లిపోతాడు. ఇలా బుల్లెట్ బైకును సైతం ఎంతో సులభంగా (Man stole bullet bike) చోరీ చేసిన ఈ దొగను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ దొంగ తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘బుల్లెట్ బైకును సైతం ఎంతో సులభంగా ఎత్తుకెళ్లాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1500కి పైగా లైక్‌లు 1.15 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..