Share News

Guntur : దళిత ద్రోహి సునీల్‌కుమార్‌

ABN , Publish Date - Jan 24 , 2025 | 05:30 AM

ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ దళిత జాతికి నమ్మకద్రోహం చేశారని జీసస్‌ బిలీవర్స్‌ అసోసియేషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జోసఫ్‌ మోసిగంటి ఆరోపించారు.

Guntur :  దళిత ద్రోహి సునీల్‌కుమార్‌

  • జీసస్‌ బిలీవర్స్‌ అసోసియేషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జోసఫ్‌

పొన్నూరుటౌన్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ దళిత జాతికి నమ్మకద్రోహం చేశారని జీసస్‌ బిలీవర్స్‌ అసోసియేషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జోసఫ్‌ మోసిగంటి ఆరోపించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పొన్నూరులో గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో సునీల్‌కుమార్‌ దళిత జాతిని అడ్డం పెట్టుకుని పరోక్షంగా జగన్‌రెడ్డికి మద్దతు ఇచ్చి సీఐడీ డీజీగా ప్రమోషన్‌ పొందారని ఆరోపించారు. ఆయనపై విచారణ ప్రారంభమయ్యేసరికి సోషల్‌ మీడియాలో అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌ ఆర్మీలో చేరండి అని ప్రకటనలు ఇస్తున్నారన్నారు. ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. విజయ్‌పాల్‌, నందిగం సురేష్‌, బోరుగడ్డ అనిల్‌ కుమార్‌, సంజయ్‌కుమార్‌, పీవీ సునీల్‌కుమార్‌ లాంటి దళిత, క్రైస్తవ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారిని జగన్మోహన్‌రెడ్డి వాడుకుని ఇరికించేశారని ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి మావాడు అనుకుని ఓట్లు వేసి క్రైస్తవులు గెలిపిస్తే క్రైస్తవులకు అన్యాయం చేశాడని ఆరోపించారు. దళిత జాతికి సునీల్‌ కుమార్‌ చేసిందేమి లేదని జోసఫ్‌ దుయ్యబట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం

Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 05:30 AM