Ration card: 31లోపు రేషన్ కార్డుదారుల ఈకేవైసీ
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:17 AM
రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియను ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులకు సర్కులర్ జారీ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈకేవైసీ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సి ఉంది. రేషన్ డీలర్లు, తాహసీల్దార్లు, డీఎ్‌సవోలు, కలెక్టర్ల (సివిల్ సప్లయిస్) లాగిన్‌లలో ఈకేవైసీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ-పోస్ పరికరాల ద్వారా ఈకేవైసీని అప్‌డేట్ చేసుకునే సౌకర్యం ఉంది. 5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా మిగిలిన లబ్ధిదారులందరి ఈకేవైసీపీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. లేకపోతే రేషన్‌కార్డుదారులకు భవిషత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది’ అని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు.

లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు
పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాలు
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియను ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులకు సర్కులర్ జారీ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈకేవైసీ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సి ఉంది. రేషన్ డీలర్లు, తాహసీల్దార్లు, డీఎ్‌సవోలు, కలెక్టర్ల (సివిల్ సప్లయిస్) లాగిన్‌లలో ఈకేవైసీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ-పోస్ పరికరాల ద్వారా ఈకేవైసీని అప్‌డేట్ చేసుకునే సౌకర్యం ఉంది. 5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా మిగిలిన లబ్ధిదారులందరి ఈకేవైసీపీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. లేకపోతే రేషన్‌కార్డుదారులకు భవిషత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది’ అని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే