Share News

22-ఏ జాబితా నుంచి తొలగించండి

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:18 AM

సోంపేట పట్టణ పరిధిలోని తమ ఇళ్ల స్థలాలు 22ఏ జాబితాలో నమోదు చేయబడ్డాయని వాటిని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన పలువురు ప్రజలు అధికారులను కోరారు.

22-ఏ జాబితా నుంచి తొలగించండి
మాట్లాడుతున్న ఈవో శాంతకుమారి

సోంపేట, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): సోంపేట పట్టణ పరిధిలోని తమ ఇళ్ల స్థలాలు 22ఏ జాబితాలో నమోదు చేయబడ్డాయని వాటిని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన పలువురు ప్రజలు అధికారులను కోరారు. స్థానిక మహదేవిపేట వీధిలో పంచాయతీ ఈవో ఎం.శాంతకుమారి ఆధ్వర్యంలో గ్రామసభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహదేవిపేట, సూర్యవాసవీధి, జలంత్ర జాలారివీధితో పాటు పంచాయతీ పరిధిలో ఉన్న తమ ఇళ్ల స్థలాలు 22ఏ జాబితాలో చేర్చడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అలాగే పంచాయతీలో అపరిస్కృతంగా ఉన్న కాలువల నిర్మాణం, రోడ్లు, తాగునీటి కుళాయిలు తదితర సమస్యలను పరిష్కరించాలని పలువురు సభ్యులు కోరారు. సమావేశానికి సచివాలయ సిబ్బంది తప్ప ఇతర శాఖల అధికారులు పాల్గొనకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్‌ సర్పంచ్‌ వెంకటరమణ, మాజీ ఎంిపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, బీన ఆనంద్‌, కొంచాడ నెహ్రూ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 12:18 AM