Share News

అదనంగా ధాన్యం కొనుగోలు

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:12 AM

నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతుల నుంచి ప్రభుత్వం అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమదా లవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు.

అదనంగా ధాన్యం కొనుగోలు
మాట్లాడుతున్న రవికుమార్‌ :

ఆమదాలవలస, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతుల నుంచి ప్రభుత్వం అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమదా లవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. బుధవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో సాగు చేసిన రైతులు ఇటీవల రైతు సేవాకేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించినా, ఇంకా ధాన్యం నిల్వలు ఉన్నట్లు తనకు పలువురు రైతులు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ సమస్యపై ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు సంబంధితమంత్రులకు తెలియజేసినట్లు చెప్పారు.దీంతో నియో జకవర్గంలో అదనంగా రైతుల నుంచి లక్ష క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిఇచ్చి నట్లు తెలిపారు. పొందూరు మండలంలో 35 వేలు, ఆమదాలవలస, బూర్జ మండలాల్లో 25 వేలు క్వింటాళ్లు చొప్పున, బూర్జ మండలంలో 25 క్వింటాళ్లు చొప్పున, సరుబుజ్జిలి మండలంలో 15 వేల క్విం టాళ్లు ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

Updated Date - Mar 13 , 2025 | 12:12 AM