Share News

పేలిన ఆర్టీసీ బస్సు టైరు

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:16 AM

పలాస నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారి కొత్త పేట వద్దకు వచ్చేసరికి టైరు పేలి పోయింది.

పేలిన ఆర్టీసీ బస్సు టైరు
టైరు పేలిపోయిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఇదే..

పలాస, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పలాస నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారి కొత్త పేట వద్దకు వచ్చేసరికి టైరు పేలి పోయింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవ హరించడంతో త్రుటిలో ప్రాణాపా యం తప్పింది. బుధవారం ఉద యం 11 గంటలకు పలాస ఆర్టీసీ బస్‌స్టాప్‌ నుంచి విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. కొత్తపేట జంక్షన్‌ సమీపించే సరికి ఒక్కసారి గా బస్సు వెనుక ఒక టైర్‌ పేలిపోయింది. భారీ శబ్దం రావ డంతో ప్రయాణికులు హడలిపో యారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవ హరించి బస్సును రోడ్డు మార్జిన్‌ వైపు తిప్పడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు పక్కనే ఉన ్న ఓ మెకానిక్‌ షెడ్‌ వద్దకు తీసుకెళ్లి టైరు మార్పించారు. అనంతరం బస్సు విశాఖపట్నం వెళ్లిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:16 AM