Share News

తోటి ఉద్యోగుల నుంచే లంచం

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:17 AM

తోటి ఉద్యోగులనే లంచం అడిగాడు. రూ.25 వేలు ఇస్తేనే సర్వీసు రికార్డులు అప్‌డేట్‌ చేస్తానని డిమాండ్‌ చేశాడు.

తోటి ఉద్యోగుల నుంచే లంచం
లంచం సొమ్ముతో పట్టుబడిన బాలరాజు

శ్రీకాకుళం క్రైం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తోటి ఉద్యోగులనే లంచం అడిగాడు. రూ.25 వేలు ఇస్తేనే సర్వీసు రికార్డులు అప్‌డేట్‌ చేస్తా నని డిమాండ్‌ చేశాడు. బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపో యాడు. ఏసీబీ అధికారుల వివరాల మేరకు.. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సం ఘం కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా బి.బాలరాజు పనిచేస్తున్నాడు. అదే శాఖలోని వసతిగృహాల్లో పనిచేస్తున్న కుక్‌, అటెండర్‌ 2015 నుంచి తమకు రావాల్సిన ఇంక్రిమెంట్ల కోసం మూడేళ్లుగా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసు చు ట్టూ తిరుగుతున్నారు. వీటి కోసం ఆ ఇద్దరి సర్వీసు రికార్డు అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. దీంతో సీనియర్‌ అసిస్టెంట్‌ వారిని రూ.25 వేలు అడిగాడు. అసలే చిన్న ఉద్యోగాలని, చాలీచాలని జీతాలు కావడం వల్ల అంత ఇచ్చుకోలేమని వారు బతిమలాడుకున్నారు. అయినా పని కాకపోవడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ సూచన మేరకు ఆ ఇద్దరూ డబ్బులు తీసుకుని బాల రాజుకు ఫోన్‌ చేశారు. భోజనం సమయంలో మున్సిపల్‌ కార్యాలయానికి తెచ్చి ఇవ్వాలని బాలరాజు చెప్పాడు. అక్కడ వారి నుంచి బాలరాజు రూ.25వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడ్ని బీసీ వెల్ఫేర్‌ ఆఫీసుకు తీసుకెళ్లి సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ బీవీ ఎస్‌ఎస్‌ రమణమూర్తి విలేకరులతో మాట్లా డుతూ.. 2016లో హాస్టల్‌ విద్యార్థుల స్కాలర్‌ షిప్‌ స్కాంలో బాలరాజు ఏసీబీకి చిక్కారని, అయినా ఆయన తీరులో మార్పు రాలేదని అన్నారు. ఈ కేసు కోర్టులో నడుస్తుందని, ఈనెల 26న వాయిదా కూడా ఉందని తెలి పారు. తాజా కేసులో బాలరాజును అరెస్టు చేశామని, గురువారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ 1064కి లేదా నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు ఎస్‌వీ రమణ, కె.భాస్కరరావు, ఎస్‌ఐ డి.సత్యారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:17 AM