టార్గెట్ చేరుకుటారా?
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:13 AM
మార్చి నెల వచ్చిందంటే మున్సిపల్ రెవిన్యూ అధికారులు గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి.

పలాస, మార్చి 12 (ఆంధ్రజ్యోతి)
మార్చి నెల వచ్చిందంటే మున్సిపల్ రెవిన్యూ అధికారులు గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఈ నెలలో వారికి ఇచ్చిన పన్ను వసూళ్ల టార్గెట్‌కు 90 శాతమైనా చేరుకోవాల్సి ఉంటుంది. మొండి బకాయలు, ప్రభుత్వ కార్యాలయాల పన్నులు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంటి పన్నులు పెరిగిన నేపథ్యంలో వాటిని కట్టించుకునేందుకు అధికారులు ఇంటింటికీ వెళ్తున్నారు. చాలా మున్సిపాలిటీల్లో 50 శాతం కూడా వసూలు కాలేదు. దీంతో సచివాలయ సిబ్బందిని కూడా విధుల్లో తీసుకుని టార్గెట్‌ను చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటిలో ఈ ఏడాది రూ.8.22 కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యం కాగా ఇప్పటి వరకూ రూ.5.27 కోట్లు వచ్చింది. గత ఏడాది ఇదే సమయానికి సగం కూడా వసూలు కాకపోవడంతో ఇక్కడి అధికా రులు ఉన్నతాధికారులతో చీవాట్లు తిన్నారు. చివరకు ఏదోఒకవిధంగా టార్గెట్‌కు చేరుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది మాత్ర ం ముందుగా మొండిబకాయలపై దృష్టి పెట్టి వాటిని సాధించారు. అనంతరం పెద్ద పద్దు లపై పడి పన్నులు కట్టించారు. ఇక మిగిలింది కోర్టు వివాదాల్లో ఉన్నవి, ప్రభుత ్వ కార్యాల యం బకాయలు. వీటిపై ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసు కుంటున్నారు. నెలాఖరు నాటికి పైరెండు మిన హా శతశాతం లక్ష్యంగా పెట్టుకోవడం విశేషం. ఇచ్ఛాపురంలో రూ.5.03 కోట్ల పన్నుల లక్ష్యం కాగా రూ.1.85 కోట్లు మాత్రమే వసూలైంది. ఆమదాలవలసలో రూ.6.17 కోట్లకు గాను రూ.2.33 కోట్లు వచ్చింది. శ్రీకాకుళం నగర పాలకసంస్థలో రూ.47.11 కోట్ల పన్నుల లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.19.53 కోట్లు మాత్రమే రాబట్టుకున్నారు. కేవలం 17 రోజుల మాత్రమే గడువు ఉండడంతో 50 శాతానికి పైగా పన్ను లు వసూళ్లు ఎలా చేయాలోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీల ఆరి ్థక పరిపుష్టికి పన్నులే ప్రధాన వనరు. అయితే సకాలంలో పన్నులు కడితేనే అభివృద్ధి సాధ్య మనేది ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.
నెలాఖరు నాటికి అధిగమిస్తాం..
టార్గెట్‌ను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయడానికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఇంటింటికీ నేరుగా వెళ్లి పన్నులు కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించడంతో పాటు కట్టకపోతే అనర్థాలు కూడా చెప్పి ఒప్పిస్తున్నా ము. కొంతమంది వినియో గదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కడుతున్నారు. సకాలంలో పన్నులు కడితే వారికి మినహాయింపు కూడా ప్రభుత్వం కల్పించింది.
-డి.ప్రభాకరరావు, రెవెన్యూ అధికారి, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ