జిల్లాలోకి నాలుగు ఏనుగులు
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:14 AM
ఇప్పటికే మన్యం జిల్లాను హడలెత్తిస్తున్న ఏనుగుల గుంపు జిల్లాలోకి ప్రవేశించింది. కొత్తూరు మండలం కడుము, హంస మామిడి తోటల్లో నాలుగు ఏనుగులు రెండు రోజులుగా సంచరిస్తూ స్థానికుల కంటపడ్డాయి.

కొత్తూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే మన్యం జిల్లాను హడలెత్తిస్తున్న ఏనుగుల గుంపు జిల్లాలోకి ప్రవేశించింది. కొత్తూరు మండలం కడుము, హంస మామిడి తోటల్లో నాలుగు ఏనుగులు రెండు రోజులుగా సంచరిస్తూ స్థానికుల కంటప డ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం కొత్తూరు పోలీ సులు, పారెస్టు అధికారులకు తెలియజేశారు. వేసవి కావడంతో పాటు ఎండలు తీవ్రత అధికంగా ఉండటంతో సేదదీరడానికి మామిడి తోటల్లోకి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. సమీపంలోనే వంశధార నదిలో నీరు ఉండడంతో అక్కడే తిష్ట వేసినట్లు తెలుస్తోంది. రాత్రివేళల్లో తమ గ్రామాలవైపు వచ్చి పంటలు నష్టం చేస్తా యోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. యువకులు రాత్రివేళ పెద ్దపెద్ద శబ్దాలు చేస్తూ పహారా కాస్తున్నారు. కొత్తూరు సీఐ చింతాడ ప్రసాద్, ఎస్‌ఐ అమీ ర్ ఆలీ, పారెస్టు సిబ్బంది బుధవారం అక్కడికి వెళ్లారు. ఏనుగుల వైపు ఎవరూ వెళ్లవద్దని, కవ్వింపు చర్యలకు దిగవద్దని ప్రజలకు సూచనలు చేశారు. ఏనుగులు గ్రామాల వైపు రాకుండా పారెస్టు సిబ్బంది, గ్రామస్థులు రోడ్లపై కాపలా కాస్తున్నారు. బుధవారం రాత్రి కుంటిభద్ర పరిసరాల వరకు ఏనుగులు వచ్చాయని గ్రామస్థులు చెబుతున్నారు.
ఫ ఏనుగులు కొంతకాలంగా వంశధార నది ఆవల పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కీసరి, కొసలి, తాలాడ తదితర ప్రాంతాల్లో పంటలను ధ్వంసం చేశాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో కడుము ప్రాంతం నుంచి మరింత ముందకు వస్తే నదీతీర గ్రామాల్లోని చెరకు, అంతర పంటలకు నష్టం చేస్తాయని సిరుసువాడ, కుంటిబద్ర, పెనుగోటవాడ, మాతల, వసప గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.