Share News

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: డీఈవో

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:14 AM

: పదో తరగతి పరీక్షల నిర్వహణకు పరీక్ష కేంద్రాల్లోో పగడ్బందీ ఏర్పాట్లుచేశామని జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య తెలిపారు. బుధవారం పొందూరు ప్రభుత్వోన్నత పాఠశాలలో నిర్వహి స్తున్న పాఠశాల సముదాయాన్ని పరిశీలించారు.

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: డీఈవో
మాట్లాడుతున్న డీఈవో తిరుమల చైతన్య

పొందూరు, మార్చి 12 (ఆంద్రజ్యోతి): పదో తరగతి పరీక్షల నిర్వహణకు పరీక్ష కేంద్రాల్లోో పగడ్బందీ ఏర్పాట్లుచేశామని జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య తెలిపారు. బుధవారం పొందూరు ప్రభుత్వోన్నత పాఠశాలలో నిర్వహి స్తున్న పాఠశాల సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 17నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షలకు 149 కేం ద్రాలు ఏర్పాట్లుచేస్తున్నామని, 28,984 మంది విద్యార్థులు హాజరు కానున్నా రని తెలిపారు. ఆరు కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామ నిచెప్పారు.ఛీప్‌ సూరింటెండెంట్‌, డిపార్ట్‌ మెంట్‌ అధికారి, సిట్టింగ్‌స్క్వాడ్‌ను నియ మించినట్లు తెలిపారు. ఓపెన్‌స్కూల్‌ విధానంలో పదో తరగతికి సంబంధించి ఎనిమిది కేంద్రాల్లో 807 మంది పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు.

ఫకవిటి, మార్చి12(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు క్లస్టర్‌ స్థాయిలో బుధవా రం సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొరివంక, కవిటి, రాజ పురం, బెలగాం పరిధిలో ఉపాధ్యాయులతో జరిగిన కాంప్లెక్స్‌ సమావేశంలో ఎంఈవో ధనుంజయ మజ్జి ప్రభుత్వం నిర్ధేశించిన అంశాలను వివరించారు.

ఫసరుబుజ్జిలి, మార్చి12(ఆంధ్రజ్యోతి):నూతన పోకడల్లో బోధనలు సాగించిన ప్పుడే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని సమగ్ర శిక్ష సీఎంవో పేడాడ ప్రభాకరరావు తెలిపారు. మండలంలోని రొట్టవలస హైస్కూల్‌లో నిర్వహించిన క్లస్టర్‌ వనరుల కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఐఈడీ కో-ఆర్డినేటర్‌ బి.గోవిందరావు, హెచ్‌ఎం కత్తిరి రామకృష్ణరావు పాల్గొన్నారు.

ఫ కవిటి,మార్చి12(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఉన్నతంగా లక్ష్యాన్ని నిర్ణయిం చుకొని, అదేఆలోచనతో ముందుకు సాగాలని అనకాపల్లి అదనపు ఎస్పీ ఎల్‌. మోహనరావు కోరారు.బుధవారంబొరివంక జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రామకృష్ణ పాల్గొన్నారు.

ఫ ఇచ్ఛాపురం, మార్చి12(ఆంధ్రజ్యోతి): చదువులో రాణిస్తేనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఈదుపురం జడ్పీ ఉన్నతపాఠశాల హెచ్‌ఎం తమ్మయ్య తెలిపారు. బుధవారం పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించారు.

ఫసోంపేట, మార్చి 12(ఆంధ్రజ్యోతి) : పలాసపురం జడ్పీ ఉన్నతపాఠశాలలో వీడ్కోలు కార్య క్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం బల్ల హరికృష్ణ, వెంకటరమణ, నాగేశ్వరరావు, విధ్యాకమిటీ చైౖర్మన్‌ బి.రాజేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:14 AM