Share News

Explain the constituency issues నియోజకవర్గ సమస్యలు వివరించండి

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:45 PM

Explain the constituency issues నరసన్నపేట నియోజకవర్గ సమస్యలను సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో వివరించాలని ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను కలిసి సమస్యలను వివరించారు.

Explain the constituency issues  నియోజకవర్గ సమస్యలు వివరించండి
కలెక్టర్‌కు సమస్యలను వివరిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, మార్చి 24(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట నియోజకవర్గ సమస్యలను సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో వివరించాలని ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను కలిసి సమస్యలను వివరించారు. వంశధార కాలువల షట్టర్లు మరమ్మతులు, గార-వనితమండలం వంతెన నిర్మాణం పనులు, పొలాల్లో మిగులు ధాన్యం కొనుగోలు, తాగునీటి సమస్యలు, రోడ్లు, కాలువల సమస్యలతో పాటు నరసన్నపేట పట్టణాన్ని మోడల్‌గా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యతను వివరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 11:45 PM