Share News

చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలి

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:59 PM

అట్రాసిటీ చట్టా లను పటిష్ఠంగా అమలు చేయాల ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

 చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): అట్రాసిటీ చట్టా లను పటిష్ఠంగా అమలు చేయాల ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మంది రంలో శనివారం సౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధ క చట్టంపై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, నరస న్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి జిల్లాస్థాయి విజిలెన్స్‌ మోనటరింగ్‌ కమిటీతో కలెక్టర్‌తో సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థి తులను సభ్యులు పరిశీ లించి అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచించారు. సమావే శంలో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ విశ్వ మోహన్‌ రెడ్డి, డీఆర్వో ఎం.వెంక టేశ్వరరావు, ఉప కలెక్టర్‌ లక్ష్మణరావు, పలాస ఆర్డీవో, డీపీవో సౌజన్య, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ కిరణ్‌, కమిటీ సభ్యుల పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 12:01 AM