Share News

పెండింగ్‌ ఫిర్యాదులను పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:54 PM

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్‌ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు.

పెండింగ్‌ ఫిర్యాదులను పరిష్కరించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్‌ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ రీసర్వే, రెవెన్యూ సదస్సులు, ఫిర్యాదులు, ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ, ల్యాండ్‌ బ్యాంక్‌, కోర్టు కేసులు, వక్ఫ్‌ ఆస్తుల సర్వే వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.గోకులాలు పూర్తిచేయాలని ఆదేశించారు. మార్కెటింగ్‌, ఉద్యాన, పరిశ్రమలు, గృహ నిర్మాణ,మత్స్య శాఖల లక్ష్యాలు, ప్రగతిని సమీక్షించారు. ఎంపీడీవోలు సాంఘిక సంక్షేమశాఖ సిబ్బందితో సమీక్షించి వసతి గృహాల భవనాల మరమ్మతులపై చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధానమంత్రి సూర్య ఘర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ కృష్ణమూర్తిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, ఉపకలెక్టర్‌ పద్మావతి, జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా, సీపీవో ప్రసన్నలక్ష్మి, డ్వామా పీడీ సుధాకర్‌, ఆర్డీవోలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, హౌసింగ్‌ పీడీ నగేష్‌, జిల్లాలోని ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:54 PM