Share News

murder case భార్య హత్య కేసులో భర్త అరెస్టు

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:34 PM

murder case సంతసీతారాంపురం గ్రామంలో ఈ నెల 17వ తేదీ రాత్రి భార్యను హత్య చేసిన ఘటనలో భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

murder case భార్య హత్య కేసులో భర్త అరెస్టు
వివరాలను వెల్లడిస్తున్న జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం

ఎచ్చెర్ల, మార్చి 19(ఆంధ్రజ్యోతి): సంతసీతారాంపురం గ్రామంలో ఈ నెల 17వ తేదీ రాత్రి భార్యను హత్య చేసిన ఘటనలో భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌లో జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం విలేకరులకు వెల్లడించారు. గాలి అప్పలరెడ్డి, నాగమ్మలకు 22 ఏళ్ల కిందట వివాహమైందని, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యా భర్తలు ఇద్దరూ ఎప్పుడులాగే సోమవారం రణస్థలం మండలం కొవ్వాడ గ్రామంలో సరుగుడు, నీలగిరి తోటలు నరికే పని పూర్తిచేసుకుని రాత్రి 7.30 గంటలకు ఇంటికి చేరుకు న్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న అప్పలరెడ్డి ఆ రోజు కూడా అదే మత్తు లో భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆయన విచక్షణ కోల్పోయి ఇంట్లో ఉన్న కత్తితో భార్యపై దాడిచేసి హతమార్చాడు. ఆ తర్వాత తానే హత్య చేసినట్టు వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. కుమారుడు త్రినాథ్‌ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఎస్‌ఐలు వి.సందీప్‌కుమార్‌, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 11:34 PM