Share News

cheated on in love ప్రేమించి మోసం చేశాడంటూ ఫిర్యాదు

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:36 PM

cheated on in love మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన కిరణ్‌ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చెసుకుంటానని చెప్పి మోసం చేశాడని బుధ వారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

cheated on in love   ప్రేమించి మోసం చేశాడంటూ ఫిర్యాదు

జి.సిగడాం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన కిరణ్‌ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చెసుకుంటానని చెప్పి మోసం చేశాడని బుధ వారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆ యువతి డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉండగా.. సిగటాపు కిరణ్‌ కూడా డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుం టున్నాడు. వీరిద్దరూ 2021 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో కిరణ్‌ వేరే అమ్మాయిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత యువతి కిరణ్‌ను నిలదీసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వై.మధుసూదనరావు తెలిపారు.

Updated Date - Mar 19 , 2025 | 11:36 PM