Share News

రియల్‌ దగా!

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:00 AM

నిబంధనలు తుంగలో తొక్కి మండలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతుంది. కనీస నిబంధనలు కూడా పట్టించుకోవడం లేదు. వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఏంచాక్కా వెంచర్లగా మార్చేసి దోచుకుంటున్నారు.

రియల్‌ దగా!

  • అనుమతుల్లేకుండా వెలుస్తున్న వెంచర్లు

  • మోసపోతున్న కొనుగోలుదారులు

  • చోద్యం చూస్తున్న యంత్రాంగం

సోంపేట, మార్చి 19(ఆంధ్రజ్యోతి): నిబంధనలు తుంగలో తొక్కి మండలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతుంది. కనీస నిబంధనలు కూడా పట్టించుకోవడం లేదు. వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఏంచాక్కా వెంచర్లగా మార్చేసి దోచుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి అన్నిరకాల అనుమ తులు తీసుకోవాల్సి ఉన్నా.. సోంపేటలో మాత్రం అమలు కావడం లేదు. వెంచర్లను డివిజనల్‌ అధికారి, తహసీల్దార్‌ కలసి పరిశీలన చేసి సదరు భూ హక్కులు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధాణ చేసి అందు కు అనుమతులు ఇవ్వాలి. వ్యవసాయ భూములను వ్యవ సాయేతర భూముల్లోకి మార్పులు చేసుకోవాలి. దీనికోసం స్థల బదలాయింపు చార్జీలను చలానా రూపంలో వసూలు చేయాల్సి ఉంటుంది. అనంతరం వివిధ శాఖల అధికారుల అనుమతులు వచ్చాక స్థలంపై రహదారులు నిర్మించాల్సి ఉంటుంది. అయితే పట్టణానికి సమీపాన కవిటి వెళ్లే రోడు ్డకు ఆనుకొని ఉన్న సుమారు నాలుగు ఎకరాల స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండానే లే ఔట్‌ వేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. అంతేకాకుండా గతంలో జిరాయితీ భూమి అయి నప్పటికీ ప్రసుత్తం ఈ స్థలం నిషేధిత భూముల (22ఏ) జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదేమీ కొనుగోలుదా రులకు చెప్పకుండా మసిపూసి మారేడుకాయ చేస్తూ విక్ర యాలు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కొనుగోలు దారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చర్యలకు ఆదేశించాం

కవిటి రోడ్డులోని వెంచర్‌కు సంబంధించి భూ బదాలయింపు కోసం దరఖాస్తు వచ్చింది. పరిశీలించాగా అందులో కొంత భూమి నిషేధిత జాబితాలో ఉంది. ఈ విషయాన్ని భూ యజమానులకు తెలిపాం. అయినా అనుమతులు లేకుండా భూమిని అభివృద్ధి చేసిన విషయం తన దృష్టికి వచ్చింది. ఈ విషయమై చర్యలకు ఈవోని ఆదేశించాం.

- బి.అప్పలస్వామి, తహసీల్దార్‌

లే ఔట్‌ను తొలగిస్తాం

కవిటి రోడ్డులో ఎటువంటి అనుమతు లు లేకుండా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వే స్తున్నట్టు తన దృష్టికి వచ్చింది. రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించి తొలగిస్తాం.

- ఎం.శాంతికుమారి, ఈవో, సోంపేట

అనుమతులు లేకుండా వేసిన వెంచర్‌

  • రాత్రికి రాత్రే నిర్మాణాలు

  • నిబంధనలకు తిలోదకాలు

ఆమదాలవలస, మార్చి 19(ఆంధ్రజ్యోతి): స్థానిక పు రపాలక సంఘ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుం డా రాత్రికి రాత్రే ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరుపుతు న్నారు. వీఎల్‌టీ, నాలా కట్టకుండా వ్యవసాయ భూముల ను కమర్షియల్‌ స్థలాలుగా మార్చేస్తున్నా మున్సిపల్‌ అధి కారులు చోద్యం చూడడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనను విమర్శించే ప్రస్తుత అధికార పార్టీ నాయకులు ఈ అక్రమ నిర్మాణాలపై స్పందించక పోవడంపై సర్వాత్రా చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. పురపాలక సంఘం ఒకటో వార్డు పార్వతీశంపేట పరిధిలో ఉన్న 22 సెంట్లు స్థలంలో ఒక వ్యక్తి ఔట్‌ లెట్‌ టైల్స్‌ వ్యాపారం పేరుతో గతంలో ఒక నిర్మాణాన్ని చేపట్టా రు. ప్రస్తుతం దాని వెనుక భాగంలో సుమారు ఎనిమిది సెంట్లు విస్తీర్ణంలో ఎటువంటి అనుమతులు తీసుకోకుం డా పక్కాగా నిర్మాణాలు ప్రారంభించారు. స్థానికులు స మాచారం మేరకు మున్సిపల్‌ అధికారులు సదరు వ్యక్తికి నోటీసు జారీ చేశారు. అయితే అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్న ఆ వ్యక్తి ఆ నోటీసులకు పట్టించుకోలేదు. సామాన్యులపై కొరఢా ఝుళిపించే ము న్సిపల్‌ అధికారులకు ఈ వ్యవహారం పట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

పార్వతీశంపేట సర్వే నెంబరు 53లో నిర్మాణం చేపడుతున్న వ్యక్తికి ఇప్పటికే ఒకసారి నోటీసు జారీ చేశాం. రెండోసారి నోటీసు ఇవ్వడానికి సిద్ధం చేశాం. ప్రస్తుతం మున్సిపల్‌ కమిషనర్‌ సెలవులో ఉండడం వల్ల ఇవ్వలేకపోయామన్నారు.

- చింతాడ నవీన్‌కుమార్‌, ఇన్‌చార్జి టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌

Updated Date - Mar 20 , 2025 | 12:00 AM