Share News

నిందితులకు శిక్ష పడేలా చూడాలి

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:13 AM

జిల్లాలో పలు నేరాల్లో పట్టుబడిన నిందితు లకు.. శిక్షలు ఖరారయ్యేలా పోలీసులు పనిచేయాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి సూ చించారు.

నిందితులకు శిక్ష పడేలా చూడాలి
మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు నేరాల్లో పట్టుబడిన నిందితు లకు.. శిక్షలు ఖరారయ్యేలా పోలీసులు పనిచేయాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి సూ చించారు. వివిధ కేసులను కోర్టుకు తీసుకువెళ్లే కోర్టు రైజింగ్‌ అధికారులుగా బాధ్య తలు వహిస్తున్న ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో శనివారం జిల్లా పోలీసు కార్యాల యంలో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల్లో నిందితు లకు శిక్షలుపడేలా కోర్టు వి ధుల్లో ఉండే పోలీసుల పాత్ర కీలకం అన్నారు. సమీక్షలో కోర్టు కేసులు విచారణ, విధానం, వి విధ దశల్లో ఉన్న కేసు ల అంశాలని పరిశీలిం చారు. విచారణలో ఉ న్న కేసులకు సంబంధించి ఎదురవుతు న్న సమస్యలు, సమన్స్‌ జారీ, వారెంట్స్‌ అమలు, సాక్షులను కోర్టులో హాజరు పరచడం, కేసు అభియోగ పత్రాల దాఖలు, ఇతరత్రా విధివిధానా లపై పలు ఆదేశాలు జారీచేశారు. నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడినప్పుడే బాధి తులకు న్యాయం జరుగుతుందని స్ప ష్టం చేశారు. కోర్టు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటిక ప్పుడు ఎస్‌ఐలకు, సీఐలకు తెలియజే యాలని ఆదేశించారు. కేసుల వివరా లను కోర్టు క్యాలెండర్‌లో నమోదు చే యాలని చెప్పారు. కేసు ట్రయల్స్‌ సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సల హాలు తీసుకోవాలన్నారు. సీఎంఎస్‌ కోర్టు మానటరింగ్‌ సిస్టం ఎస్‌ఐ కోటే శ్వరరావు, కోర్టు కాని స్టేబుళ్లు, ఏఎస్‌ ఐలు, హెచ్‌సీలు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 01:13 AM