Share News

TTD Donations: టీటీడీ ట్రస్టులకు రూ.2.45 కోట్ల విరాళం

ABN , Publish Date - Mar 28 , 2025 | 04:14 AM

టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులకు గురువారం రూ.2.45 కోట్లు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన జినేశ్వర్‌ ఇన్‌ఫ్రా వెంచర్స్‌ మరియు శ్రీలంక నుంచి వచ్చిన మరో దాత ఒక్కొక్కరికి రూ.కోటి విరాళం అందించారు

TTD Donations: టీటీడీ ట్రస్టులకు రూ.2.45 కోట్ల విరాళం

తిరుమల, మార్చి 27(ఆంధ్రజ్యోతి): టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులకు గురువారం రూ.2.45 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకు చెందిన జినేశ్వర్‌ ఇన్‌ఫ్రా వెంచర్స్‌ సంస్థ రూ.కోటి, శ్రీలంకకు చెందిన మరో దాత రూ.కోటి విరాళంగా అందజేశారు. ఈ మొతాన్ని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు వినియోగించాలని దాతలు కోరారు. అలాగే నోయిడాకు చెందిన పసిఫిక్‌ బీపీవో ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కూడా ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళంగా అందించింది. దాతలు విరాళాలను టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

Updated Date - Mar 28 , 2025 | 04:16 AM