Share News

తొలిరోజు 94.87 శాతం పింఛన్లు పంపిణీ

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:17 AM

జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ల పంపిణీ మంగళవారం ఒక్క రోజులోనే 94.87 శాతం పూర్తయ్యింది. డీఆర్‌డీఏ పీడీ శచీదేవి అందించిన వివరాల ప్రకారం.. జిల్లాలో 2,56,072 మందికి వివిధ రకాల పింఛన్ల రూపంలో రూ.108 కోట్లు మంజూరయ్యాయి.

తొలిరోజు 94.87 శాతం పింఛన్లు పంపిణీ
గొలుగొండ మండలం గుండుపాలలో మహిళకు పింఛన్‌ సొమ్ము అందజేస్తున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

అనకాపల్లి, ఏఫ్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ల పంపిణీ మంగళవారం ఒక్క రోజులోనే 94.87 శాతం పూర్తయ్యింది. డీఆర్‌డీఏ పీడీ శచీదేవి అందించిన వివరాల ప్రకారం.. జిల్లాలో 2,56,072 మందికి వివిధ రకాల పింఛన్ల రూపంలో రూ.108 కోట్లు మంజూరయ్యాయి. ఒకటో తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయాల సిబ్బంది తమ పరిధిలో ఇంటింటికీ వెళ్లి 2,43,580 (94.87 శాతం) మందికి పింఛన్‌ డబ్బులు పంపిణీ చేశారు. ఈ నెల 5వ తేదీ వరకు పంపిణీకి అవకాశం ఉన్నందున గడువులోగా అందరికీ డబ్బులు అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా పింఛన్‌ల పంపిణీలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గొలుగొండ మండలం గుండుపాలలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, పాయకరావుపేట మండలం అరట్లకోటలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, పరవాడ మండలం వాడచీపురుపల్లిలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ లబ్ధిదారులకు పింఛన్‌లు డబ్బులు అందజేశారు.

Updated Date - Apr 02 , 2025 | 12:17 AM