Share News

టీడీపీలో వర్గపోరు

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:45 AM

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబుకు అవమానం జరిగిందని ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. బుధవారం ఇక్కడ జరిగిన టీడీపీ మండల విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తాతయ్యబాబు ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌.రాజు సమక్షంలో ఇరువర్గాల కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. టీడీపీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జిగా, ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వున్న ఆయన ఫొటోను ఉద్దేశపూర్వకంగానే పెట్టలేదని ఎలిశెట్టి గణేశ్‌, సయ్యపురెడ్డి మాధవరావు, తలారి శంకర్‌, గురుమూర్తి, కోవెల వెంకటరమణ, తదితరులు ధ్వజమెత్తారు. దీంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారికి, తాతయ్యబాబు వర్గీయులకు మధ్య వాగ్వాదం మరింత ముదిరింది.

టీడీపీలో వర్గపోరు
గొడవ పడుతున్న టీడీపీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తలు

బుచ్చెయ్యపేట మండల విస్తృతస్థాయి సమావేశం ఫ్లెక్సీలో కానరాని జిల్లా అధ్యక్షుడి ఫొటో

తాతయ్యబాబు అనుచరులు అభ్యంతరం

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పెత్తనం ఏమిటంటూ ఆగ్రహం

ఇరువర్గాల మధ్య గొడవ

బుచ్చెయ్యపేట, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబుకు అవమానం జరిగిందని ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. బుధవారం ఇక్కడ జరిగిన టీడీపీ మండల విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తాతయ్యబాబు ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌.రాజు సమక్షంలో ఇరువర్గాల కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. టీడీపీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జిగా, ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వున్న ఆయన ఫొటోను ఉద్దేశపూర్వకంగానే పెట్టలేదని ఎలిశెట్టి గణేశ్‌, సయ్యపురెడ్డి మాధవరావు, తలారి శంకర్‌, గురుమూర్తి, కోవెల వెంకటరమణ, తదితరులు ధ్వజమెత్తారు. దీంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారికి, తాతయ్యబాబు వర్గీయులకు మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. ఎన్నికల ముందు టీడీపీ గెలుపు కోసం కష్టపడినవారిని కాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం కల్పిస్తున్నారంటూ పరోక్షంగా విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణను ఉద్దేశించి ఆరోపించారు. అనంతరం తాతయ్యబాబు వర్గీయులు సమావేశాన్ని బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Apr 04 , 2025 | 12:45 AM