Share News

Protecting Traditional Seeds: విత్తన హక్కుతోనే సంప్రదాయ విత్తనాలకు రక్షణ

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:54 AM

విత్తన హక్కును చట్టం ద్వారా అమలు చేస్తే సంప్రదాయ విత్తనాలను రక్షించవచ్చని కోదండరెడ్డి అన్నారు. కడ్తాల్‌లో ముగిసిన విత్తన పండుగలో రైతులకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని సూచించారు

Protecting Traditional Seeds: విత్తన హక్కుతోనే సంప్రదాయ విత్తనాలకు రక్షణ

  • రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి

  • అన్మా‌స్‌పల్లిలో ముగిసిన విత్తన పండుగ

కడ్తాల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రైతుల విత్తన హక్కుకు చట్ట రూపం ఇచ్చి దానిని అమలుపరచినప్పుడే దేశీయ సంప్రదాయ విత్తనాలను రక్షించుకోగలుగుతామని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి అన్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావాలని కోరారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం అన్మా‌స్‌పల్లి ‘ది ఎర్త్‌ సెంటర్‌’లో సీజీఆర్‌, ‘భారత్‌ బీజ్‌ స్వరాజ్‌ మంచ్‌’ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ తొలి విత్తన పండుగ కార్యక్రమం ఆదివారం ముగిసింది. 20 అంశాలతో ఐదు భాషల్లో డిక్లరేషన్‌ ప్రకటించారు. ప్రముఖ విధాన విశ్లేషకుడు దొంతి నర్సింహరెడ్డి రచించిన ఆరోగ్యానికి ఆహారం-భద్రతకు విత్తనం పుస్తకాన్ని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో కోదండ రెడ్డి మాట్లాడుతూ.. కల్తీ విత్తనాలను అరికట్టడానికి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సంప్రదాయ విత్తనాలతో సేంద్రియ సాగు ద్వారా భూసారాన్ని, ప్రకృతిని పరిరక్షించుకోవచ్చన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. దేశంలో ఆకుపచ్చ విప్లవానికి, పర్యావరణ పరిరక్షణకు, దేశీయ సంప్రదాయ విత్తనాలకు అన్మా‌స్‌పల్లి ‘ఎర్త్‌ సెంటర్‌’ కేంద్రంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ దిలీప్‌రెడ్డి, సీజీఆర్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కోర్పోలు లీలారెడ్డి, పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివా‌స్‌గౌడ్‌, మధుసూదన్‌ రెడ్డి, సీజీఆర్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:54 AM