హితేష్ కు స్వర్ణం
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:54 AM
ప్రపంచ బాక్సింగ్ కప్‌ను భారత్ ప్రశంసనీయంగా ముగించింది. బ్రెజిల్‌లో జరిగిన ఈ టోర్నీలో మనోళ్లు ఒక స్వర్ణం సహా ఆరు పతకాలతో సత్తా చాటారు...

అభినా్‌షకు రజతమే!
భారత్‌కు ఆరు పతకాలు
ప్రపంచ బాక్సింగ్ కప్
న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ కప్‌ను భారత్ ప్రశంసనీయంగా ముగించింది. బ్రెజిల్‌లో జరిగిన ఈ టోర్నీలో మనోళ్లు ఒక స్వర్ణం సహా ఆరు పతకాలతో సత్తా చాటారు. 70 కి. విభాగంలో హితేష్ విజేతగా నిలవడం ద్వారా పసిడి పతకం అందించాడు. 65కి.లలో అభినాష్ జమ్వాల్ రజతం సొంతం చేసుకున్నాడు. జదుమణి సింగ్ (50కి.), మనీష్ రాథోడ్ (55కి.), సచిన్ (60కి.), విశాల్ (90కి.) కాంస్య పతకాలు సాధించారు. ప్రపంచ కప్‌లో మొత్తం 10 మంది బాక్సర్లు భారత్ తరపున బరిలో దిగారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..