ముగిసిన డిప్యూటీ సీఎం పర్యటన
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:13 AM
ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజులు పర్యటన ముగించుకుని మంగళవారం తిరుగు పయనమయ్యారు.

గోపాలపట్నం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి):
ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజులు పర్యటన ముగించుకుని మంగళవారం తిరుగు పయనమయ్యారు. ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు, పలువురు అధికారులు వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 1.50 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ 2.05 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.