Share News

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:23 AM

ఇంటర్మీయట్‌ పరీక్షలు శనివారంతో ముగిశాయి. జిల్లాలో 26 కేంద్రాల్లో ఈ నెల 1వ తేదీన ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. 144 సెక్షన్‌, సీసీ కెమెరాల నిఘా నడుమ ఎక్కడా కాపీయింగ్‌, ఇతర అక్రమాలకు తావివ్వకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్టు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా శాఖాధికారి కె.అప్పలరామ్‌ పేర్కొన్నారు.

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు
పాడేరులో పరీక్ష కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు

సాఫీగా నిర్వహించినట్టు అధికారులు వెల్లడి

పాడేరురూరల్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీయట్‌ పరీక్షలు శనివారంతో ముగిశాయి. జిల్లాలో 26 కేంద్రాల్లో ఈ నెల 1వ తేదీన ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. 144 సెక్షన్‌, సీసీ కెమెరాల నిఘా నడుమ ఎక్కడా కాపీయింగ్‌, ఇతర అక్రమాలకు తావివ్వకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్టు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా శాఖాధికారి కె.అప్పలరామ్‌ పేర్కొన్నారు. కాగా శనివారం జరిగిన ద్వితీయ ఇంటర్‌ పరీక్షకు జనరల్‌ విద్యార్థులు 4,170 మందికిగాను 4,054 హాజరయ్యారు. ఒకేషనల్‌ పరీక్షకు 884 మందికిగాను 805 మంది హాజరయ్యారు.

Updated Date - Mar 16 , 2025 | 01:23 AM