జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోండి
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:19 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ కోరారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 29 కంపెనీల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కలెక్టర్ దినేశ్‌కుమార్
పాడేరురూరల్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ కోరారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 29 కంపెనీల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాబ్ మేళాకు 784 మంది నిరుద్యోగ యువత హాజరుకాగా 85 మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్.పి.రోహిణి, టీడీపీ నాయకులు బొర్రా నాగరాజు, బొర్రా విజయరాణి, డప్పోడి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.