Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:28 PM
Minister Ramanaidu: ఏపీని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వంసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద విధ్వంసకారుడుగా చరిత్రలో జగన్ నిలిచిపోయారని మంత్రి రామానాయుడు ఆరోపించారు.

పశ్చిమగోదావరి: పాలకొల్లు నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో రూ.4 కోట్లతో అభివృద్ధి పనులను ఇవాళ(ఆదివారం) మంత్రి రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇరిగేషన్ అత్యవసర పనులకు సీఎం చంద్రబాబు రూ.380 కోట్లు నిధులు మంజూరు చేశారని మంత్రి రామానాయుడు అన్నారు.
జల జీవన్ మిషన్ ద్వారా కేంద్రప్రభుత్వ సహకారంతో రూ.95.44 లక్షల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందించనున్నామని తెలిపారు. ఏపీని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వంసం చేశారని విమర్శించారు. వైసీపీ హయాంలో రాజధాని అమరావతి, పోలవరానికి ఎంతో నష్టం కలిగిందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద విధ్వంసకారుడిగా చరిత్రలో జగన్ నిలిచిపోయారని మంత్రి రామానాయుడు ఆరోపించారు.
కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి: గండి బాబ్జి
విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు, పెందుర్తి ఇన్‌చార్జ్ గండి బాబ్జి తెలిపారు. పెందుర్తి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఇవాళ(ఆదివారం) గండి బాబ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా గండి బాబ్జి మాట్లాడారు. పెందుర్తి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని గండి బాబ్జి చెప్పారు.
సీఎం చంద్రబాబు సుదీర్ఘమైన రాజకీయ జీవితం అందరికీ ఆదర్శమని గండి బాబ్జి చెప్పారు. టీడీపీ హయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరిగిందని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి, ఐటీ అభివృద్ధికి చంద్రబాబే కారణమని ఉద్ఘాటించారు. ఇప్పుడు చంద్రబాబు హయాంలోనే నవ్య ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలోకి దూసుకు వెళ్తుందని గండి బాబ్జి అన్నారు. విశాఖపట్నానికి రైల్వే జోన్, మెట్రో రైల్ సాధించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని.. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. వైసీపీ హయాం అంతా రాక్షస పాలనేనని..రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారని విమర్శించారు. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని మండిపడ్డారు. విజయ సాయి రెడ్డి లాంటి వ్యక్తులు జగన్ కోసం మాట్లాడుతున్నారని చెప్పారు. విజయ సాయిరెడ్డి నిజాలే మాట్లాడుతున్నారు..ఆయనలో పరివర్తన వచ్చిందని గండి బాబ్జి అన్నారు.
ఈ నెలలోనే సబ్బవరం, పరవాడలో కూడా టీడీపీ కార్యాలయాలు ప్రారంభం కానున్నాయని గండి బాబ్జి అన్నారు. కూటమి ప్రభుత్వంలో విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు, విశాఖ రైల్వే జోన్ వచ్చిందని తెలిపారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ కల సహకారం కానుందని చెప్పుకొచ్చారు. అనకాపల్లి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 2 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఎంతోమంది పిల్లలు ఉంటే అంతమందికి మే నెల నుంచి తల్లికి వందనం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని అన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో కూటమి పార్టీల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని త్వరలోనే పరిష్కరించుకుంటామని గండి బాబ్జి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
AP News: టీడీపీ తరపున ఏజెంట్‌గా కూర్చుంటే హత్యలు చేస్తారా..: కనపర్తి శ్రీనివాసరావు
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News