Central Ministers: విశాఖకు కేంద్రమంత్రులు.. ఘనస్వాగతం పలికిన కూటమి నేతలు
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:27 PM
Central Ministers: విశాఖ ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో స్టీల్ ప్లాంట్‌కు కేంద్రమంత్రులు చేరుకోనున్నారు. స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం వద్దకు చేరుకోనున్న కేంద్రమంత్రులు అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటామనే దానిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం, జనవరి 30: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు (Visakha Steel Plant) కేంద్రం రూ.11,440 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా కేంద్ర ఉక్కు శాఖామంత్రి కుమార స్వామి (Union Steel Minister Kumaraswamy), కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (Union Minister of State for Steel Bhupathi Raju Srinivasa Varma) విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టులో వీరికి కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ , విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, కూటమి నేతలు, కార్యకర్తలు అందరూ కూడా విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రులకు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రులకు కూటమి మహిళ నేతలు, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు.
అనంతరం అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్‌కు బయలుదేరారు. మార్గ మధ్యలో కూడా కేంద్రమంత్రులకు కూటమి పార్టీ నేతలు గజమాలలు వేసి స్వాగతం తెలిపారు. షీలా నగర్ వద్ద కేంద్ర మంత్రులు కుమార స్వామి, శ్రీనివాస వర్మలకు గజమాలతో సగౌరవంగా స్వాగతించారు. కాసేపట్లో స్టీల్ ప్లాంట్‌కు కేంద్రమంత్రులు చేరుకోనున్నారు. స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం వద్దకు చేరుకోనున్న కేంద్రమంత్రులు అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటామనే దానిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ తర్వాత తొలిసారి కేంద్రమంత్రులు పర్యటిస్తున్న నేపథ్యంలో అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రుల పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
గవర్నర్‌కు ప్రవర్తనా నియమావళి రూపొందించండి
మరోవైపు స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు కార్మిక సంఘాలు కోరుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయమని ప్రకటన చేయాలని, సెయిల్‌లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ గత1449 రోజుల నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్రం మంత్రులు ప్రకటన చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
అలర్ట్.. కుంభమేళాలో 5 కీలక మార్పులు..
స్వల్ప ప్రమాదం
మరోవైపు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి స్టీల్ ప్లాంట్‌కు కేంద్రమంత్రులు వెళ్తున్న సమయంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. షీలా నగర్ వద్ద మంత్రుల కాన్వాయ్‌లోని ఒక కారు సడన్ బ్రేక్ వేయడంతో ఆ వెనకే వస్తున్న మూడు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొని స్వల్పంగా దెబ్బ తిన్నాయి. దెబ్బతిన్న వాటిలో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు వెహికల్ కూడా ఉంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం వేరే కార్లలో స్టీల్ ప్లాంట్‌కు బయలుదేరారు నేతలు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.
ఇవి కూడా చదవండి...
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News