Share News

జన్మభూమి అభివృద్ధికి రూ.35.15 కోట్లు

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:20 AM

జన్మభూ మి అభివృద్ధికి రాజువేగేశ్న ఫౌండేషన్‌ (ఇండి యా) ద్వారా ఎన్‌ఆర్‌ఐ వేగేశ్న అనంత కోటి రాజు కోట్లాది రూపాయలు వెచ్చించడం స్ఫూర్తి దాయకమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీని వాస వర్మ అన్నారు.

జన్మభూమి అభివృద్ధికి రూ.35.15 కోట్లు
అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, ఎన్‌ఆర్‌ఐ అనంతకోటిరాజు

వేగేశ్న ఫౌండేషన్‌ ద్వారా ఎన్‌ఆర్‌ఐ అనంత కోటిరాజు దాతృత్వం

శిలాఫలకం ఆవిష్కరించిన మంత్రులు శ్రీనివాసవర్మ, నిమ్మల

గణపవరం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): జన్మభూమి అభివృద్ధికి రాజువేగేశ్న ఫౌండేషన్‌ (ఇండి యా) ద్వారా ఎన్‌ఆర్‌ఐ వేగేశ్న అనంత కోటిరాజు కోట్లాది రూపాయలు వెచ్చించడం స్ఫూర్తి దాయకమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. అనంతకోటిరాజు స్వగ్రామం గణపవరంలో సుమారు 8 ఎకరాల్లో రూ. 20 కోట్లతో చెరువుల అభివృద్ధి, రూ.15కోట్లతో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, పాఠశాలల అదనపు తరగతి గదులు, ప్రహరీ నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాలకు మొత్తం రూ. 35.15 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను శుక్రవారం మంత్రులు ఆవిష్క రించారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అధ్యక్ష తన జరిగిన సభలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ సంపాదనలో కొంత భాగం స్వగ్రా మం అభివృద్ధికి ఖర్చు చేస్తున్న వేగేశ్న ఫౌండే షన్‌ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మంత్రి నిమ్మ ల రామానాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐల సేవలు ఎంతో అవసరమ న్నారు. ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ వేగేశ్న ఫౌండేషన్‌ ఇండియా చైర్మన్‌ అనంత కోటిరాజు చేపడు తున్న ఆధ్యాత్మిక, విద్య, తాగునీరు వంటి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ అనంతకోటి రాజు సేవలు మరువలేనివని, గణపవరంలో వంద పడకల ఆసుపత్రి, బీసీ హాస్టల్‌ నిర్మాణ స్థలాలు కూడా సమకూర్చాలని కోరారు. అనం తరం ఎన్‌ఆర్‌ఐ అనంతకోటిరాజు దంపతులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్థానికులు గజమాల లతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఎంపీపీ దండు రాము, క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్లు పొత్తూరి వాసురాజు, ఇందుకూరి రామకృష్ణం రాజు, గ్రామాభివృద్ధి కన్వీనర్‌ కాకర్ల విష్ణు శ్రీనివాసరావు, సర్పంచ్‌ మూరా అలంకారం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:20 AM